ఆగస్టు 23 నాటికి సలహాలు, సూచనలు పంపండి: ప్రధాని మోదీ
ఢిల్లీ: 27 జూలై (హి.స.) ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 23వ తేదీన నేషనల్‌ స్పేస్‌ డే సందర్భంగా ప్రజలు సలహాలు, సూచనలు పంపాలని పిలుపునిచ్చారు. ఇందుకు నమో యాప్‌ను వాడుకోవాలన్నారు. భారత విద్యార్థులు అంతర్జాత
ఆగస్టు 23 నాటికి సలహాలు, సూచనలు పంపండి: ప్రధాని మోదీ


ఢిల్లీ: 27 జూలై (హి.స.)

ప్రధాని నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 23వ తేదీన నేషనల్‌ స్పేస్‌ డే సందర్భంగా ప్రజలు సలహాలు, సూచనలు పంపాలని పిలుపునిచ్చారు. ఇందుకు నమో యాప్‌ను వాడుకోవాలన్నారు. భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని మోదీ చెప్పుకొచ్చారు.

ప్రధాని మోదీ 124వ మన్‌కీ బాత్‌ కార్యక్రమం నేడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. విజ్ఞానం, క్రీడలు, సంస్కృతిక, భారత్‌ సాధించి విషయాలపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో మోదీ.. ఇటీవల కాలంలో భారత్‌లో చాలా విశేషాలు చోటు చేసుకున్నాయని.. అవన్నీ ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. ఇటీవల శుభాన్షు శుక్లా ఐఎస్‌ఎస్‌కు వెళ్లి.. భూమిపైకి చేరుకోగానే దేశమంతా ఆనందంతో, గర్వంతో నిండిపోయిందని పేర్కొన్నారు. చంద్రయాన్‌-3ని విజయవంతంగా ల్యాండింగ్‌ చేసిన తర్వాత దేశంలో ఓ ప్రత్యేకమైన శాస్త్రీయ వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ప్రస్తుతం పిల్లలు సైతం స్పేస్‌ సైన్స్‌పై ఆసక్తి చూపుతున్నారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande