జస్టిస్‌ వర్మ అభిశంసనపై కేంద్రం నియంత్రణ
న్యూఢిల్లీ,27 జూలై (హి.స.) ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆకస్మిక రాజీనామాకు గల కారణాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. రాజ్యసభ చైర్మన్‌ హోదాలో ధన్‌ఖడ్‌ స్వతంత్రంగా వ్యవహరించడమే ఆయన చేసిన పెద్ద నేరంగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీ
జస్టిస్‌ వర్మ అభిశంసనపై కేంద్రం నియంత్రణ


న్యూఢిల్లీ,27 జూలై (హి.స.)

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆకస్మిక రాజీనామాకు గల కారణాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. రాజ్యసభ చైర్మన్‌ హోదాలో ధన్‌ఖడ్‌ స్వతంత్రంగా వ్యవహరించడమే ఆయన చేసిన పెద్ద నేరంగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ సింఘ్వీ వ్యాఖ్యానించారు. జస్టిస్‌ వర్మ అభిశంసన తీర్మానం విషయంలో రాజ్యసభ చైర్మన్‌గా ధన్‌ఖడ్‌ వ్యవహరించిన తీరు కేంద్రంలోని పెద్దలకు కొరుకుడు పడలేదని, అందుకే ఆయనను రాజీనామా చేసేలా వ్యవహరించారని ఆరోపించారు. జస్టిస్‌ వర్మ అభిశంసనపై నియంత్రణను కేంద్రం తన చేతిలోకి తెచ్చుకోవాలని భావించిందన్నారు. దీనికి ధన్‌ఖడ్‌ ఒప్పుకోకపోవడం, స్వతంత్రంగా వ్యవహరించడంతో.. ‘‘ముందు లోక్‌సభలోనే మా తీర్మానం. రాజ్యసభలో కాదు. నీతో పనిలేదు పో!.’’ అన్నట్టుగా కేంద్రం వ్యవహరించిందని సింఘ్వీ వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande