నేడు ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్
ఢిల్లీ 27 జూలై (హి.స.)ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌ (FIDE Women''s Chess World Cup) ఫైనల్ ఆసక్తికరంగా సాగుతుంది. జార్జియాలోని బటుమి నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో టైటిల్ కోసం భారత గ్రాండ్ మాస్టర్, తెలుగమ్మాయి కోనేరు హంపి, ఇంటర్నేషనల్ గ్రా
నేడు ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్


ఢిల్లీ 27 జూలై (హి.స.)ప్రతిష్టాత్మక ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌ (FIDE Women's Chess World Cup) ఫైనల్ ఆసక్తికరంగా సాగుతుంది. జార్జియాలోని బటుమి నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో టైటిల్ కోసం భారత గ్రాండ్ మాస్టర్, తెలుగమ్మాయి కోనేరు హంపి, ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ తలపడుతున్నారు. వీరద్దరి మధ్య శనివారం తుది పోరు తొలి గేమ్ 41 ఎత్తుల్లో 0.5-0.5తో డ్రాగా ముగిసింది. ఈ గేమ్‌లో హంపి తెల్లపావులతో బరిలోకి దిగగా, నల్లపావులతో దివ్య అటాకింగ్‌ గేమ్‌ను ఎంచుకుంది.

గేమ్‌లో తొలుత దివ్య ఒకింత ఆధిక్యం కనబర్చగా, హంపి దీటుగా స్పందించింది. క్వీన్‌, రూక్‌తో ఒక్కసారిగా హంపి గేమ్‌ రూపురేఖలను మార్చింది. గేమ్‌ ముందుకు సాగితే ఫలితం మరోలా ఉంటుందన్న అంచనాతో హంపి, దివ్య డ్రాకు ఒప్పుకున్నారు. ఇక ఇవాళ ఇద్దరి మధ్య రెండో గేమ్ జరుగనుంది. ఇది కూడా డ్రా అయితే సోమవారం టై బ్రేక్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఇందులో గెలిచిన వారు ప్రపంచ విజేతలుగా నిలుస్తారు. ఇక ఈ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరిలో ఎవరు గెలిచినా అది భారత మహిళల చెస్‌ చరిత్రలోనే రికార్డ్ కానుంది. గతంలో ఏ భారత మహిళా ప్లేయర్ కూడా ఫిడే చెస్ ప్రపంచ కప్‌ ఫైనల్ చేరలేదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande