తూత్తుకుడి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ ప్రారంభం-ప్రధాని నరేంద్ర మోదీ
చెన్నై,27 జూలై (హి.స.) ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ బలం తెలిసిందని, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంలో మేక్‌ ఇన్‌ ఇండియా కీలక పాత్ర వహించిందని ప్రధాని మోదీ అన్నారు. మాల్దీవుల పర్యటన ముగించుకున్న ఆయన శనివారం రాత్రి తమిళనాడులోని తూత్తుకుడికి ప్రత్యేక విమాన
PM Modi while addressing a public event in Motihari


చెన్నై,27 జూలై (హి.స.)

ఆపరేషన్‌ సిందూర్‌తో భారత్‌ బలం తెలిసిందని, ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడంలో మేక్‌ ఇన్‌ ఇండియా కీలక పాత్ర వహించిందని ప్రధాని మోదీ అన్నారు. మాల్దీవుల పర్యటన ముగించుకున్న ఆయన శనివారం రాత్రి తమిళనాడులోని తూత్తుకుడికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. తమిళుల సంప్రదాయ దుస్తులతో విచ్చేసిన మోదీకి రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి, కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, ఎల్‌.మురుగన్, రాష్ట్ర మంత్రి తంగం తెన్నరసు తదితరులు స్వాగతం పలికారు. రూ.450 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తూత్తుకుడి విమానాశ్రయంలో విస్తరించిన కొత్త టెర్మినల్‌ను మోదీ ప్రారంభించారు. రాష్ట్రంలో రూ.4,900 కోట్లతో పూర్తిచేసిన వివిధ రహదారులు, రైల్వే మార్గాలను ఆయన జాతికి అంకితం చేశారు.

అనంతరం మాట్లాడుతూ.. బ్రిటన్, మాల్దీవుల పర్యటనల్లో చారిత్రక ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు చెప్పారు. ఆత్మవిశ్వాసంతో భారత్‌ అభివృద్ధి చెందుతోందన్నారు. తమిళనాడును అభివృద్ధి చేసే పని 2014లో ప్రారంభం అయిందని, ఈ 11 ఏళ్లలో రహదారులు, ఇంధనం, విమానాశ్రయాలు సహా పలు పథకాలను పూర్తి చేసినట్లు చెప్పారు. తూత్తుకుడి విమానాశ్రయం కొత్త టెర్మినల్‌ ద్వారా ఏడాదికి 20 లక్షల మంది రాకపోకలు సాగించొచ్చన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. దక్షిణ తమిళనాడు ముఖద్వారంగా తూత్తుకుడి మారుతుందని, వాణిజ్యం వృద్ధి చెందుతుందని, కొత్త విమానాశ్రయాల వల్ల లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande