కొన్ని గంటల్లోనే భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతో తెలుసా..?
ముంబై, 4 జూలై (హి.స.)ఇటీవల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. గత రెండు, మూడు రోజుల నుంచి పరుగులు పెడుతోంది. ఉదయం పెరిగిన బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే భారీగా పతనమైపోయింది. దేశంలో సామాన్యులు కొనలేని పరిస్థితుల్లో బంగారం ధరలు ఉంటున్నాయి. మళ్లీ లక్ష రూ
Gold


ముంబై, 4 జూలై (హి.స.)ఇటీవల నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. గత రెండు, మూడు రోజుల నుంచి పరుగులు పెడుతోంది. ఉదయం పెరిగిన బంగారం ధరలు.. కొన్ని గంటల్లోనే భారీగా పతనమైపోయింది. దేశంలో సామాన్యులు కొనలేని పరిస్థితుల్లో బంగారం ధరలు ఉంటున్నాయి. మళ్లీ లక్ష రూపాయలకు చేరువలో ఉన్న పసిడి.. శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి తగ్గుముఖం పట్టింది. జూలై 3న బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. అయితే, ఈరోజు బంగారం ధర మునుపటి రోజుతో పోలిస్తే భారీగా తగ్గింది. గుడ్ రిటర్న్స్ ప్రకారం.. ఈరోజు ఉదయం వరకు బంగారం ధర రూ.600 తగ్గింది. దీనితో, ఈరోజు దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.98,730 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.90,500 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.98,880కి కొనుగోలు చేయవచ్చు. ఇది రూ.600 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,650కి చేరుకోగా, 18 క్యారెట్ల బంగారం 74,170కి చేరుకుంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములకు) ధర రూ.98,730. 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,500, 18 క్యారెట్ల బంగారం రూ.74,050కి కొనుగోలు చేయవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande