లంజడన్, 4 జూలై (హి.స.)వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ అరీనా సబలెంక, ఎలెనా ర్యాబకినా, డిఫెండింగ్ ఛాంపియన్ బార్బొరా క్రెజికోవా, ఇగా స్వియటెక్ మూడో రౌండ్‌కు అర్హత సాధించారు. మరీ బోజ్కోవాతో జరిగిన మ్యాచులో 7-6 (7/4), 6-4 తేడాతో సబలెంక నెగ్గింది. గ్రీస్‌కు చెందిన మరియా సక్కారీపై 6-3, 6-1 తేడాతో నెగ్గిన ర్యాబకీనా ముందంజ వేసింది.
డిఫెండింగ్ ఛాంపియన్ బార్బొరా క్రెజికోవా కూడా 6-3, 3-6, 6-2 తేడాతో యూఎస్‌కు చెందిన కరోలినా డోలహిడేపై నెగ్గి మూడో రౌండ్‌కు చేరింది. యూఎస్‌కు చెందిన మెక్‌నాలీపై 5-7, 6-2, 6-1 తేడాతో స్వియటెక్ పైచేయి సాధించింది. అయితే గతేడాది రన్నరప్‌గా నిలిచిన జాస్మిన్ పాలినీ ఈసారి మూడో రౌండ్ చేరకుండానే వెనుతిరిగింది. రష్యాకు చెందిన కమిలా రఖీమోవాతో జరిగిన రెండో రౌండ్ మ్యాచులో పాలినీ ఓడింది. రెండు గంటల 18 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచులో పాలినీ 4-6, 6-4, 6-4 తేడాతో ఓటమిపాలైంది. తను ఆడిన చివరి నాలుగు గ్రాండ్‌స్లామ్స్‌లో పాలినీ కనీసం క్వార్టర్స్‌కు చేరుకోలేకపోవడం గమనార్హం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి