అమరావతి, 4 జూలై (హి.స.)పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) హరిహర వీరమల్లు(Harihara Veeramallu) చిత్రం ట్రైలర్ సరికొత్త రికార్డు సృష్టించింది. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సౌత్ ఇండియాలో ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ట్రైలర్(44.67M వ్యూస్) టాప్‌లో ఉండగా.. ఆ వ్యూస్‌ను హరిహర వీరమల్లు బ్రేక్ చేసింది. కేవలం 23 గంటల్లోనే దాదాపు 47M వ్యూస్ సాధించింది.
దీంతో సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఆల్ టైమ్ రికార్డ్ అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కాగా, ట్రైలర్‌లో పవర్‌ఫుల్ వీరమల్లుగా యోధుడి పాత్రలో తన డైలాగులతో పవన్ ఆకట్టుకుంటున్నారు. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కనిపించనున్నారు. ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్‌ను అందరినీ ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సహా పలువురు హీరోలు, డైరెక్టర్లు ట్రైలర్‌పై ట్వీట్స్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి