కాక్‌పిట్‌లోనే గుండెపోటు.. కుప్పకూలిన పైలట్
హైదరాబాద్, 5 జూలై (హి.స.) ఎయిరిండియా ఫ్లైట్‌లో శుక్రవారం ఊహించని సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరు లో ఫ్లైట్ టేకాఫ్‌కు కొన్ని నిమిషాల ముందు కాక్‌పిట్‌లో పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే వైద్యపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనపై
ఎయిర్ ఇండియా


హైదరాబాద్, 5 జూలై (హి.స.)

ఎయిరిండియా ఫ్లైట్‌లో శుక్రవారం ఊహించని సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరు లో ఫ్లైట్ టేకాఫ్‌కు కొన్ని నిమిషాల ముందు కాక్‌పిట్‌లో పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే వైద్యపరమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ ఘటనపై ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది.తమ పైలట్‌లలో ఒకరికి ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి తలెత్తడంతో బెంగళూరు నుంచి ఢిల్లీ కి వెళ్లాల్సిన ఏఐ 2414 విమానాన్ని నడపలేకపోయారని పేర్కొంది. సంఘటన కారణంగా బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఫ్లైట్‌ను కొంతసేపు నిలిపివేశారు. మరో పైలట్ వచ్చిన తర్వాత ఫ్లైట్ బయలుదేరిందని ఎయిరిండియా తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande