వంట గదిలో కలబంద మొక్క ఉండడం వలన కలిగే అద్భుతమైన లాభాలు తెలిస్తే.. అవాక్కే..!
కర్నూలు, 5 జూలై (హి.స.)కలబంద ఒక ఔషధ మొక్క. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వాడతారు. ఎన్నో రకాల సమస్యలకు ఇది నివారిణిగా పనిచేస్తుంది. ఇంట్లో, వంట గదిలో కలబంద మొక్కను పెంచుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఇంటీరియర్ స్పేస్‌కు కొత్త లుక్‌ను అందిస్తుంది. అంతేకా
వంట గదిలో కలబంద మొక్క ఉండడం వలన కలిగే అద్భుతమైన లాభాలు తెలిస్తే.. అవాక్కే..!


కర్నూలు, 5 జూలై (హి.స.)కలబంద ఒక ఔషధ మొక్క. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వాడతారు. ఎన్నో రకాల సమస్యలకు ఇది నివారిణిగా పనిచేస్తుంది. ఇంట్లో, వంట గదిలో కలబంద మొక్కను పెంచుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఇంటీరియర్ స్పేస్‌కు కొత్త లుక్‌ను అందిస్తుంది. అంతేకాదు..కలబంద జెల్‌తో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

అలోవెరా మన ఆరోగ్యానికి హాని కలిగించే గాలిలో ఉండే విష పదార్థాలను నియంత్రిస్తుంది. దానివలన మన వంట గది స్వచ్ఛమైన గాలి తో తాజాగా ఉంచుతూ ఆరోగ్యంగా ఉంచుతుంది. కొన్ని రకాల కీటకాలను రాకుండా కూడా చేస్తుంది. అలోవెరా నుండి సువాసన రాకపోయినా గాలిని శుభ్రపరుస్తుంది. ఘాటుగా ఉండే వాసనలను, పొగ నుండి వచ్చే హానికరకాలను తగ్గిస్తుంది.

కారణంగా.. చాలా మంది దీనిని తమ ఇళ్లలో పెంచడానికి ఇష్టపడుతుంటారు. అంతేకాదు కలబంద వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తుందని నమ్ముతారు. అయితే కలబంద మొక్కను ఇంట్లో ఈ దిశలో నాటడం మాత్రం వాస్తు దోషమని.. కుటుంబ పెద్ద ప్రాణానికే ప్రమాదమని అంటున్నారు నిపుణులు.

కలబంద మొక్కలో ఉండే ఔషధ గుణాలు సౌందర్య సాధనాల్లోనే కాకుండా వంటగదిలో అనుకోకుండా చిన్న గాయాలకు మంచి మెడిసిన్‌గా కూడా పనిచేస్తుంది. వంటింట్లో అనుకోకుండా చిన్న చిన్న గాయాలు అయినప్పుడు అలోవెరా జెల్ రాసుకోవటం వల్ల తక్షణ ఉపశమనంఇస్తుంది.

అలోవెరా జెల్ మన చర్మానికి అద్భుతమైన హైడ్రేటర్ గా పనిచేస్తుంది. మన పేస్ టాన్ అయినా మన చర్మం పొడిబారిన అలోవెరా జెల్ రాసుకుంటే చాల బాగా పనిచేస్తుందని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. అలోవెరా ఆకులో ఉండే జెల్ మన ఆరోగ్యానికి చాల

దీని రసం జ్యూస్ చేసుకొని తాగడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయి.కడుపుకి ఉపసమనం కలిగిస్తుంది.గట్ హెల్త్ మెరుగు పరుస్తుంది. అలోవెరా జెల్ లో విటమిన్లు A, C, E లు ఉంటాయి. దీని మనం రెగ్యులర్ గా తీసుకోవటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande