పాట్నా, బీహార్, 5 జూలై (హి.స.)
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాట్నాలోని వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కాను ఇంటి ముందే దుండగులు కాల్చి చంపారు. హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ‘పనాచే’ హోటల్ సమీపంలో శుక్రవారం రాత్రి ఖేమ్కా హత్యకు గురయ్యారు. హోటల్ పక్కనే ఉన్న ట్విన్ టవర్ సొసైటీలో నివాసం ఉంటున్నారు. ఇంట్లోకి వెళ్తుండగా అగంతకులు హఠత్తుగా ప్రవేశించి తుపాకీతో కాల్పులు జరిపారు. అక్కడికక్కడే ఖేమ్కా ప్రాణాలు వదిలారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని, ఒక బుల్లెట్, షేల్ కేసింగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత రాత్రి 11 గంటల ప్రాంతంలో వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కాను కాల్చి చంపినట్లు తమకు సమాచారం అందిందని ఎస్పీ దీక్ష తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..