బీజాపూర్ 5 జూలై (హి.స.)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్‌లో శనివారం తెల్లవారు జామున భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. మరి కొందరు గాయపడ్డారని పోలీసులు అనుమానిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
మావోయిస్టుల ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్ దూకుడు మళ్లీ పెంచింది. కేంద్రహోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ సభలో వర్షాకాలంలోనూ మావోయిస్టులను నిదరపోనీయమని ప్రకటించిన సంగతి విదితమే.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..