కేర‌ళ‌లో నిఫా వైరస్ క‌ల‌క‌లం…చికిత్స పొందుతూ యువ‌తి మృతి
మలప్పురం 5 జూలై (హి.స.) కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఓ యువతి మృతి చెందింది. మరొకరు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కీలక జిల్లాల్లో హైఅలర్ట్ ప్
నిఫా వైరస్


మలప్పురం 5 జూలై (హి.స.)

కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఓ యువతి మృతి చెందింది. మరొకరు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కీలక జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. మలప్పురం జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని నిఫా బారిన పడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందింది. తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడుతున్న ఆమెను కొట్టక్కల్‌లోని ఆసుపత్రికి తీసుకురాగా, అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే సమయంలో, పాలక్కాడ్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ కూడా ఇదే వైరస్‌తో బాధపడుతున్నట్లు తేలింది. వీరిద్దరి నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా, నిఫా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande