ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. న‌వ వ‌రుడితో స‌హా ఎనిమ‌ది మంది బ‌లి..
హైదరాబాద్, 5 జూలై (హి.స.) ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న కారు అత్యంత వేగంగా దూసుకెళ్తూ.. నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సూరజ్(24) సహా 8 మంది ఒకే కుటుంబ సభ్యులు చనిపోగా.. ఇద్దరి
రోడ్డు ప్రమాదంరోడ్డు ప్రమాదం


హైదరాబాద్, 5 జూలై (హి.స.)

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న కారు అత్యంత వేగంగా దూసుకెళ్తూ.. నియంత్రణ కోల్పోయి ఓ కాలేజీ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు సూరజ్(24) సహా 8 మంది ఒకే కుటుంబ సభ్యులు చనిపోగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో శుక్రవారం వివాహ బృందంతో వెళ్తున్న బొలెరో ఎస్‌యూవీ కారు జెవానై గ్రామంలో కళాశాల గోడను నేటి ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఢీకొట్టింది. సంఘటనాస్థలిలోనే వరుడు ప్రాణాలు వదిలాడు. కొన్ని గంటల్లో పెళ్లి కావాల్సిన సమయంలో వరుడు చనిపోవడంతో తీవ్ర విషాదఛాయలు అలుమకున్నాయి. మృతుల్లో వరుడి వదిన ఆశా (26), ఆశా కుమార్తె ఐశ్వర్య (2), మనోజ్ కుమారుడు విష్ణు (6), వరుడి అత్త, గుర్తు తెలియని ఇద్దరు మైనర్లు సహా మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande