ఢిల్లీ, 5 జూలై (హి.స.)సుంకాలపై ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరికొన్ని గంటల్లో ముగుస్తోంది. ఆయా దేశాలకు గడువు ముంచుకొస్తోంది. యూకే, వియత్నాం, చైనా తప్ప.. ఇంకా ఏ దేశాలు అమెరికాతో ఒప్పందాలు చేసుకోలేదు. భారత్‌తో కీలక డీల్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నా.. అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు. వ్యవసాయం, పాడి శ్రమకు సంబంధించిన డీల్ పెట్టుకుంటే ముప్పు వాటిల్లుతుందేమోనని భారత్ భయపడుతోంది. ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే మాత్రం భారీగా సుంకాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య గందరగోళం నెలకొంది.
తాజాగా ఇదే అంశంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ.. మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని వ్యాఖ్యానించారు. ట్రంప్ సుంకాలకు ప్రధాని మోడీ తలవంచాల్సిందేనని.. ఇది గ్యారంటీ అని.. తన మాటల మీద నమ్మకం లేకపోతే రాసిపెట్టుకోవాలని రాహుల్‌గాంధీ సవాల్ విసిరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు