ఢీకొన్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సులు.. 36 మందికి గాయాలు.
అమర్‌నాథ్ , 5 జూలై (హి.స.)యాత్రకు వెళ్తున్న బస్సులకు ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. యాత్రికులకు సంబంధించిన ఐదు బస్సులు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం 36 మంది యాత్రికులక
ఢీకొన్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సులు.. 36 మందికి గాయాలు.


అమర్‌నాథ్ , 5 జూలై (హి.స.)యాత్రకు వెళ్తున్న బస్సులకు ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. యాత్రికులకు సంబంధించిన ఐదు బస్సులు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో మొత్తం 36 మంది యాత్రికులకు గాయాలైనట్లు తెలిసింది. బస్సుల్లో ఒకదానికి బ్రేకులు ఫెయిల్ అవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

యాత్రికుల (Amarnath pilgrims) బస్సులు జమ్మూ-శ్రీనగర్ (Jammu-Srinagar) జాతీయ రహదారిలోని చందర్‌కూట్ సమీపానికి చేరుకోగానే.. వాటిలో ఓ బస్సుకు బ్రేకులు ఫెయిలయ్యాయి. చందర్‌కూట్ లాంగర్ సైట్ వద్దకు రాగానే కాన్వాయ్‌లోని చివరి వాహనం నియంత్రణ కోల్పోయి.. నిలబడి ఉన్న (Bus accident) వాహనాలను ఢీకొట్టింది. జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌కు వెళ్తున్న కాన్వాయ్‌లో ఈ బస్సులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande