బళ్ళారి, 5 జూలై (హి.స.)ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యామ్ (Thungabhadra Dam)కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం డ్యామ్ ఇన్ ఫ్లో 71,052 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 65,464 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 21 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1624.95 అడుగులుగా ఉంది.
మరోవైపు తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు (Jurala Project)కు కూడా వరదనీటి ప్రవహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 1,15,000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,25,210 క్యూసెక్కులుగా ఉంది. అధికారులు 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 317.510 మీటర్లుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి