లారీని ఢీకొన్న బస్సు.. మహిళ మృతి, 11 మందికి గాయాలు
తిరుపతి , 5 జూలై (హి.స.)ఏపీ(Andhra Pradesh)లోని తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(శనివారం) వేకువజామున నారాయణ కాలేజీ ఎదురుగా ఆగి ఉన్న లారీని అమరరాజా కంపెనీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళా ఉద్యోగిని(25) మృతి చెందగా.. 11 మం
లారీని ఢీకొన్న బస్సు.. మహిళ మృతి, 11 మందికి గాయాలు


తిరుపతి , 5 జూలై (హి.స.)ఏపీ(Andhra Pradesh)లోని తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు(శనివారం) వేకువజామున నారాయణ కాలేజీ ఎదురుగా ఆగి ఉన్న లారీని అమరరాజా కంపెనీ బస్సు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఓ మహిళా ఉద్యోగిని(25) మృతి చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు ఘటనా స్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande