తిరుమల, 6 జూలై (హి.స.)
: రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుమారుడు పరిటాల శ్రీరామ్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. భాజపా మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తదితరులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ