ఢిల్లీ, 6 జూలై (హి.స.)నిరుద్యోగులు ఎన్నాళ్ల నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ (Agniveer Recruitment Rally)కి డేట్ ఫిక్స్ అయింది. ఈ మేరకు జూలై 31న సికింద్రాబాద్ ఏవోసీ సెంటర్ (AOC Center)లోని జోగేంద్ర స్టేడియంలో ర్యాలీని నిర్వహించబోతున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా జనరల్ డ్యూటీ, టెక్నికల్ క్లర్క్స్, ట్రేడ్ మెన్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ జులై 31 రిక్రూట్‌మెంట్ ర్యాలీ ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 14కు వరకు ఈవెంట్లు కొనసాగుతాయి. అదేవిధంగా వివిధ కేటగిరీలలో అత్యుత్తమ క్రీడాకారులకు ప్రత్యేక స్పోర్ట్స్ ట్రయల్స్ కూడా నిర్వహించనున్నారు. అగ్నివీర్ పోస్టుల భర్తీపై మరిన్ని వివరాలకు ఏవోసీ సెంటర్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి