టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా శాంతికి రూపమని ప్రధాని నరేంద్ర మోదీ
దిల్లీ, 6 జూలై (హి.స.)టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా శాంతికి రూపమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బౌద్ధ ఆధ్యాత్మిక గురువు జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘పవిత్ర ఆధ్యాత్మిక గురువు దలైలామా 90
Dalai Lama


దిల్లీ, 6 జూలై (హి.స.)టిబెట్‌ ఆధ్యాత్మిక గురువు దలైలామా శాంతికి రూపమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బౌద్ధ ఆధ్యాత్మిక గురువు జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘పవిత్ర ఆధ్యాత్మిక గురువు దలైలామా 90వ జన్మదినం సందర్భంగా 140 కోట్ల మందితో కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ప్రేమ, కరుణ, ఓర్పు, నైతిక క్రమశిక్షణకు ఆయన బలమైన చిహ్నం. మతాలకు అతీతంగా ఆయనిచ్చే సందేశం ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఆయన దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా దలైలామాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 90వ జన్మదిన శుభాకాంక్షలు. సమైక్యత, శాంతి, కరుణ సందేశాలతో ప్రపంచంలో ఆయన స్ఫూర్తిని నింపుతూనే ఉండాలి’’ అని తన సందేశంలో ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande