50 శాతం తగ్గిన టోల్ బిల్లు.. కీలక ప్రకటన చేసిన కేంద్ర రవాణా, రహదారుల శాఖ
ఢిల్లీ, 6 జూలై (హి.స.) జాతీయ రహదారులపై టోల్‌ చార్జీలను 50 శాతం వరకూ తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంతెనలు, అండర్‌ పాస్‌లు, ఫ్లైవోవర్లు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. వాహనదారుల ప్రయాణాన్ని మరింత
50 శాతం తగ్గిన టోల్ బిల్లు.. కీలక ప్రకటన చేసిన కేంద్ర రవాణా, రహదారుల శాఖ


ఢిల్లీ, 6 జూలై (హి.స.)

జాతీయ రహదారులపై టోల్‌ చార్జీలను 50 శాతం వరకూ తగ్గిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంతెనలు, అండర్‌ పాస్‌లు, ఫ్లైవోవర్లు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. వాహనదారుల ప్రయాణాన్ని మరింత చవక చేసేందుకు టోల్ లెక్కించే నియమాలను మార్చినట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖ తెలిపింది. ఇంతకాలం 2008 నిబంధనల ప్రకారం టోల్ నిర్ణయించేవారు.

దీంతో రహదారిలో సొరంగం, అండర్ పాస్‌, ఫ్లైఓవర్ వంటివి ఉంటే.. సదరు నిర్మాణాలు ఎంత పొడవుంటే అన్ని కిలోమీటర్లను పదిరెట్లు చేసి, మొత్తం దూరానికి టోల్ విధించేవారు. తద్వారా ఈ నిర్మాణాల ఖర్చును తిరిగి పొందడం ప్రభుత్వం లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు ఈ నిబంధనలను సవరించారు. దీని ప్రకారం టోల్‌ను ఐదు రెట్ల దూరానికే లెక్కించనున్నారు. దీంతో ప్రయాణికులపై దాదాపు 50 శాతం వరకు ప్రత్యక్ష పన్ను తగ్గనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande