ఢిల్లీ, 6 జూలై (హి.స.)
అతి త్వరలోనే డబుల్ సెంచరీ చేస్తానంటూ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) కీలక ప్రకటన చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ (IPL 2025) నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. ఆ టోర్నమెంట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇక తాజాగా మరో సెంచరీ కూడా చేసి.. వార్తల్లో నిలిచాడు 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ.
అండర్ 19 జట్టు తరఫున ఇంగ్లాండ్ జట్టు పై 78 బంతుల్లోనే 143 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు వైభవ్ సూర్యవంశీ. అయితే ఈ మ్యాచ్ తర్వాత... వైభవ్ సూర్య వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నెక్స్ట్ టార్గెట్ డబుల్ సెంచరీ అంటూ ఈ యంగ్ ప్లేయర్ కీలక ప్రకటన చేశారు. వన్డేలో... డబుల్ సెంచరీ చేసి తీరుతానని చెబుతున్నాడు.
అదే సమయంలో.. తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అనేదానిపైనా కూడా క్లారిటీ ఇచ్చాడు 14 ఏళ్ల వైభవ్. టీమిండియా యంగ్ కెప్టెన్ గిల్ ( Gill ) తన స్ఫూర్తి అని.. వెల్లడించారు. వాస్తవంగా చాలామంది క్రికెటర్లకు కోహ్లీ లేదా రోహిత్ శర్మ స్ఫూర్తిగా ఉంటారు. కానీ ఈ యంగ్ క్రికెటర్ కు మాత్రం... గిల్ అంటే చాలా ఇష్టమట. అతనిలాగా బాగా ఆడి చరిత్ర సృష్టించాలని చెబుతున్నాడు. అందుకే తాజాగా రెండో టెస్టు నేపథ్యంలో... నేరుగా స్టేడియానికి వెళ్లి మరి మ్యాచ్ చూసాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి