పహల్గామ్, 6 జూలై (హి.స.)పాకిస్తాన్ తన నీచబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయకుల్ని చంపారనేది సుస్పష్టం. అయినా కూడా, ఆ దేశ నాయకత్వం తమ తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అజర్‌బైజాన్ వేదికగా జరిగిన ఆర్థిక సహకార సంస్థ(ఈసీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్‌పై అక్కసును వెళ్లగక్కారు. భారత్ పహల్గామ్ ఉగ్రదాడిని ప్రాంతీయ శాంతి దెబ్బతీసేందుకు ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. భారతదేశ ప్రతిస్పందనను ‘‘ప్రేరేపించిన, నిర్లక్ష్య శత్రుత్వం’’గా అభివర్నించారు. ఈ ప్రాంతాన్ని అస్థిరపరచడమే భారత్ ఉద్దేశమని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ