ప్రముఖ పంజాబీ నటి తానియ తండ్రిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పు
మోగ, 6 జూలై (హి.స.)ప్రముఖ పంజాబీ నటి తానియ తండ్రిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పేషంట్‌నంటూ వచ్చి ఆయన ప్రాణాలు తీయబోయాడు. పాయింట్ బ్లాన్క్‌లో గన్ను పెట్టి నటి తండ్రిని కాల్చాడు. తీవ్రంగా గాయపడ్డ నటి తండ్రి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రా
ప్రముఖ పంజాబీ నటి తానియ తండ్రిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పు


మోగ, 6 జూలై (హి.స.)ప్రముఖ పంజాబీ నటి తానియ తండ్రిపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. పేషంట్‌నంటూ వచ్చి ఆయన ప్రాణాలు తీయబోయాడు. పాయింట్ బ్లాన్క్‌లో గన్ను పెట్టి నటి తండ్రిని కాల్చాడు. తీవ్రంగా గాయపడ్డ నటి తండ్రి ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నటి తానియ తండ్రి అనిల్‌జిత్ కాంభోజ్ ఓ డాక్టర్. ఆయన మోగ జిల్లాలోని హర్బన్స్ నర్సింగ్ హోమ్‌లో పని చేస్తున్నాడు. శుక్రవారం ఓ ఇద్దరు వ్యక్తులు ఆయన దగ్గర ట్రీట్‌మెంట్ చేయించుకోవడానికి వచ్చారు. అనిల్‌జిత్ క్యాబిన్‌లోకి వెళ్లారు. లోపలికి వెళ్లిన తర్వాత ఓ వ్యక్తి తన కాలికి ఇన్‌ఫెక్షన్ సోకిందని ఆయనతో చెప్పాడు.

అనిల్ అతడి కాలిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే రెండో వ్యక్తి తనతో పాటు తెచ్చుకున్న తుపాకి తీశాడు. అనిల్‌కు అతి దగ్గరగా వచ్చి కాల్పులు జరిపాడు. దీంతో ఆయన చావుకేక పెట్టి.. కుర్చీలోంచి కిందపడిపోయాడు. కాల్పులు జరిపిన అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande