నా ఫస్ట్ క్రష్ ఆమెనే.. ఆ చాన్స్ వస్తే అస్సలు వదులుకోను.. చైతన్య కామెంట్స్ పై నెటిజన్లు షాకింగ్ రియాక్షన్..
Andhra Pradesh, 6 జూలై (హి.స.) అక్కినేని నాగ చైతన్య గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో మంచి విజయం సాధించాడు. ఇక రీసెంట్‌గా ‘తండేల్’(Thandel) మూవీతో భారీ
నా ఫస్ట్ క్రష్ ఆమెనే.. ఆ చాన్స్ వస్తే అస్సలు వదులుకోను.. చైతన్య కామెంట్స్ పై నెటిజన్లు షాకింగ్ రియాక్షన్..


Andhra Pradesh, 6 జూలై (హి.స.)

అక్కినేని నాగ చైతన్య గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘జోష్’(Josh) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో మంచి విజయం సాధించాడు. ఇక రీసెంట్‌గా ‘తండేల్’(Thandel) మూవీతో భారీ విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం ‘ఎన్‌సి-24’(NC-24) సినిమాలో నటిస్తున్నాడు. కార్తీక్ దండు(Karthik Dandu) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. చైతూ గతంలో తన ఫస్ట్ ఎవరనే విషయాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. గతంలో లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్లలో సైతం చైతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

భవిష్యత్తులో హిందీలో ఎవరితో పనిచేయాలని ఉందని యాంకర్ ప్రశ్నించగా.. చైతూ స్పందిస్తూ.. ‘నా ఫస్ట్ క్రష్ మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్(Sushmithasen). ఇదే విషయాన్ని ఆమెను కలిసినప్పుడు సైతం చెప్పాను. అలాగే అలియా భట్(AliaBhatt) యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెతో సినిమా చేసే చాన్స్ వస్తే అస్సలు వదులుకోను. అలాగే ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, కత్రినా కైఫ్ హీరోయిన్లతో నటించాలని ఉంది అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక చైతన్య కామెంట్స్ పై నెటిజన్లు షాకింగ్ రియాక్షన్ ఇస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande