విజయనగరం ఉగ్రపేలుళ్ల కుట్ర కేసు.. దూకుడు పెంచిన ఎన్ఐఏ
ఢిల్లీ, 6 జూలై (హి.స.)విజయనగరం ఉగ్రపేలుళ్ల కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఉగ్రవాదులు సమీర్, సిరాజ్‌లను ఢిల్లీకి తరలించి విచారించడానికి ఎన్ఐఏ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కేసును ఎన్ఐఏకు అప్పగించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానకిి కేంద్ర హోం
విజయనగరం ఉగ్రపేలుళ్ల కుట్ర కేసు.. దూకుడు పెంచిన ఎన్ఐఏ


ఢిల్లీ, 6 జూలై (హి.స.)విజయనగరం ఉగ్రపేలుళ్ల కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఉగ్రవాదులు సమీర్, సిరాజ్‌లను ఢిల్లీకి తరలించి విచారించడానికి ఎన్ఐఏ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కేసును ఎన్ఐఏకు అప్పగించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానకిి కేంద్ర హోం శాఖ నుండి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ నుండి జిల్లా ఎస్పీకి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. సోమవారం ఈ కేసును పూర్తిగా ఎన్ఐఏకు అప్పగించేందుకు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అహిమ్ అనే ఉగ్ర‌వాద‌ సంస్థ‌లో సిరాజ్ కీల‌క వ్య‌క్తిగా ఉండ‌టంతో ఈ సంస్థ‌కు సంబంధించిన వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ఎన్ఐఏ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఈ సంస్థ స‌భ్యులు దేశ‌వ్యాప్తంగా ఉండ‌టంతో వేగంగా పురోగ‌తి సాధించి చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే విజయనగరంలో ఉగ్రకుట్ర పన్నారని గత నెల విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్‌లను అరెస్ట్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande