విజిలెన్స్ అధికారుల‌ దాడులు.. రెండు లారీలు, జేసీబీ సీజ్‌
భూపాలపల్లి, 9 జూలై (హి.స.) జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక డంప్ చేసి మరోచోటుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను, ఒక జేసీబీ ని విజులెన్స్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల ప్రకారం… బుధవారం
విజిలెన్స్ అధికారుల‌


భూపాలపల్లి, 9 జూలై (హి.స.)

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక డంప్ చేసి మరోచోటుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను, ఒక జేసీబీ ని విజులెన్స్ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల ప్రకారం… బుధవారం రేగొండ మండల కేంద్రంలోని పరకాల – భూపాలపల్లి జాతీయ రహదారి చెక్ పోస్ట్ వద్ద ఇటుక బట్టి వెనకాల ఇసుక డంపులు చేసి అక్కడి నుండి ఇతర ప్రదేశాలకు తరలించేందుకు జెసిబితో మండలానికి చెందిన లారీల్లో లోడ్ చేస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి రెండు లారీలు, ఒక జేసీబి నీ పట్టుకుని రేగొండ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఇసుక డంపులు సీజ్ చేసి రెండు లారీలు, జేసీబీ ని స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande