కాంగ్రేస్ ఆట, వేట మొదలైంది
తెలంగాణ:రంగా రెడ్డి:షాద్ నగర్:సెప్టెంబర్:25 (హిం.స) *కాంగ్రేస్ ఆట, వేట మొదలైంది* వెంరెడ్డి, వీర్
*కాంగ్రేస్ ఆట, వేట మొదలైంది*


తెలంగాణ:రంగా రెడ్డి:షాద్ నగర్:సెప్టెంబర్:25 (హిం.స) *కాంగ్రేస్ ఆట, వేట మొదలైంది*

వెంరెడ్డి, వీర్లపల్లి శంకర్ ల ఆధ్వర్యంలో టిఆర్ఎస్ ఎంపిటిసి రాంరెడ్డి తదితరులు కాంగ్రెస్ లో చేరికలు

2023 లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని, కాంగ్రెస్ పార్టీ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఆటవేట రెండూ మొదలయ్యాయని, కాంగ్రెస్ పార్టీ మహా బూబ్ నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే వెంరెడ్డి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో స్థానిక సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో కొందుర్గు మండలం ముట్పూర్ టిఆర్ఎస్ ఎంపిటిసి చింతకింది రాంరెడ్డి, వార్డు సభ్యులు పాల శ్రీశైలం, తెరాస యూత్ ప్రెసిడెంట్ కావలి నరేందర్ తదితరులు ఆధ్వర్యంలో సుమారు 80 మంది టేకులపల్లి, ముట్పూర్, రేగడి చిలకమర్రి గ్రామాలకు చెందిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ జితేందర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ సీనియర్ నేత పురుషోత్తం రెడ్డి, ఎంపిటిసి అంజి రెడ్డి, మల్లేష్ తదితరుల ఆధ్వర్యంలో ఎంపిటిసి రాంరెడ్డి తదితరులు పెద్దఎత్తున పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వెంరెడ్డి నరేందర్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారిని ఉద్దేశించి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో లేకున్నా అధికార పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసల రావడం అద్భుతమైన విషయం అని అన్నారు.

షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వెలుగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో షాద్ నగర్ నియోజకవర్గం గెలుపుకు మొదటి వరుసలో ఉందని కొనియాడారు. వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో పార్టీకి చక్కని పేరు వస్తుందని అభినందించారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి సహకారం నియోజకవర్గంపై ఉంటుందని పేర్కొన్నారు. శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటిదనీ, ఈ పార్టీలో ఎందరో ప్రయోజకులుగా మారి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు నేడు పార్టీని వదిలేసి కొందరు వెళ్లారని, అయినప్పటికీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వలస వస్తున్నారని సంచలన ప్రకటన చేశారు.

జనార్దన్ రెడ్డి:రంగా రెడ్డి జిల్లా:హిందుస్తాన్ సమాచార్


 rajesh pande