రెండో టెస్టులో భారత్ ఓటమి.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్
పుణె:, 26 అక్టోబర్ (హి.స.)టెస్టుల్లో సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నటీమ్‌ఇండియా (Team India)కు న్యూజిలాండ్‌ షాక్ ఇచ్చింది. పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌పై కివీస్‌ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలో
రెండో టెస్టులో భారత్ ఓటమి.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్


పుణె:, 26 అక్టోబర్ (హి.స.)టెస్టుల్లో సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నటీమ్‌ఇండియా (Team India)కు న్యూజిలాండ్‌ షాక్ ఇచ్చింది. పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్‌పై కివీస్‌ 113 పరుగుల తేడాతో విజయం సాధించింది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. 245 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (77) రాణించగా.. మిగతావారు భారీ స్కోర్లు చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో చెలరేగిన మిచెల్ శాంట్నర్.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్ (New Zealand) 2-0తో కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. భారత గడ్డపై న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో విదేశీ గడ్డపై కివీస్‌ టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. 2012 నుంచి స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌లు సాధించిన టీమ్‌ఇండియా.. పుష్కరకాలం తర్వాత సిరీస్‌ను కోల్పోవడం గమనార్హం. మూడో టెస్టు నవంబర్ 1 నుంచి ముంబయి వేదికగా ప్రారంభంకానుంది

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande