ఆస్ట్రేలియాలో బెంగళూరు మహిళ హత్య.. ఆచూకీ చెబితే రూ.5.5 కోట్లు
హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.) ఆస్ట్రేలియాలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని 2015లో హత్యకు గురైంది. ఈ కేసులో ఇప్పటివరకు ఆస్ట్రేలియా పోలీసులు హంతకులను పట్టుకోలేకపోయారు. దీంతో ప్రభా అరుణ్ కుమార్ (41)ని ఎవరు చంపారన్న ఆచూకి చెబితే మిలియన్ డాలర్లు
ఆస్ట్రేలియాలో హత్య


హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.)

ఆస్ట్రేలియాలో బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని 2015లో హత్యకు గురైంది. ఈ కేసులో ఇప్పటివరకు ఆస్ట్రేలియా పోలీసులు హంతకులను పట్టుకోలేకపోయారు. దీంతో ప్రభా అరుణ్ కుమార్ (41)ని ఎవరు చంపారన్న ఆచూకి చెబితే మిలియన్ డాలర్లు బహుమతి ఇస్తామని తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఇండియా కరెన్సీలో అయితే రూ.5.5 కోట్లు అన్నమాట. అలాగే హత్యకు సంబంధించి ఆధారాల కోసం ప్రస్తుతం భారత్లో వేట మొదలు పెట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande