ది సబర్మతి రిపోర్ట్ సినిమాపై ప్రధాని మోదీ ప్రశంసలు..
వినోదం, 18 నవంబర్ (హి.స.) గోద్రా రైలు దుర్ఘటన నేటికీ వివాదాస్పదంగానే మిగిలిపోయింది. 2002లో జరిగిన ఆ ఘటన తర్వాత గుజరాత్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి. ఇప్పుడు ఇదే ఘటనపై బాలీవుడ్లో 'ది సబర్మతి రిపోర్ట
ప్రధాని మోడీ ప్రశంసలు


వినోదం, 18 నవంబర్ (హి.స.)

గోద్రా రైలు దుర్ఘటన నేటికీ వివాదాస్పదంగానే మిగిలిపోయింది. 2002లో జరిగిన ఆ ఘటన తర్వాత గుజరాత్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై ఇప్పటికే చాలా డాక్యుమెంటరీలు వచ్చాయి. ఇప్పుడు ఇదే ఘటనపై బాలీవుడ్లో 'ది సబర్మతి రిపోర్ట్' సినిమా విడుదలైంది . ఇందులో 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మాస్సే, టాలీవుడ్ హీరోయిన్ రాఖీ ఖన్నా, రిద్ది డోగ్రా, బర్కా సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ధీరజ్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏక్తా కపూర్ నిర్మాతగా వ్యవహరించింది. శుక్రవారం (నవంబర్ 15)న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోద్రా మారణకాండ జరిగినప్పుడు జరిగిన ఘటనను మీడియా ఎలా చిత్రీకరించిందనే ప్రధాన ఇతివృత్తంతో 'ది సబర్మతి రిపోర్ట్' సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఈ సినిమాని ఉద్దేశించి ఒక నెటిజన్ పెట్టిన పోస్ట్ప ట్విట్టర్ వేదికగా స్పందించిన మోడీ.. 'కల్పిత కథనాలు పరిమిత కాలమే కొనసాగుతాయి. సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నందుకు సంతోషంగా ఉంది' అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande