హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)2024-25లో టీమిండియా శుభారంభం చేసింది. పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. ఏకంగా 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది.
నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందే
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా టీమిండియా ఆసీస్‌తో తమ ఆఖరి సిరీస్ ఆడుతోంది. ఈ మెగా ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరాలంటే ఆసీస్‌పై కచ్చితంగా నాలుగు టెస్టుల్లో గెలవాల్సిందే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి టెస్టుకు దూరమయ్యాడు.
అయితే, సారథిగా ఉంటానంటూ బాధ్యతలు తీసుకున్న వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా.. తన పనిని సమర్థవంతంగా నెరవేర్చాడు. కెప్టెన్సీతో పాటు, ఆటగాడిగానూ అదరగొట్టిన ఈ పేస్ దళ నాయకుడు ఆసీస్ గడ్డపై కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే ఘన విజయం అందుకున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు