సైబర్ నేరగాళ్ల మోసాలపై ప్రజలను హెచ్చరించిన తెలంగాణ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.) తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించిన సంగతి తెలిసిందే. నవంబర్ 6 నుంచి ప్రారంభం కావాల్సిన ఉన్నప్పటికీ.. ఇండ్లకు స్టిక్కరింగ్ ప్రక్రియ మాత్రమే ముగిసింది. అధికారికంగా నేటి నుంచి సర్
సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్


హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.)

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభించిన సంగతి తెలిసిందే. నవంబర్ 6 నుంచి ప్రారంభం కావాల్సిన ఉన్నప్పటికీ.. ఇండ్లకు స్టిక్కరింగ్ ప్రక్రియ మాత్రమే ముగిసింది. అధికారికంగా నేటి నుంచి సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే కుటుంబ వ్యక్తిగత వివరాలను ఇంటింటికి తిరిగి అధికారులు సేకరిస్తారు. అయితే ఇదే అదునుగా భావించిన సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు.

ఈ మేరకు ఎక్స్ వేదికగా శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆసక్తికర ట్వీట్ చేశారు. కుటుంబ సర్వే అంటూ సైబర్ నేరగాళ్ల మోసాలకు పాల్పడుతారని, కుటుంబ సర్వే చేస్తున్నామంటూ సైబర్ నేరగాళ్లు ఫ్రాడ్ లింక్స్ పంపిస్తున్నారని తెలిపారు. ఆ లింక్ క్లిక్ చేస్తే వారి ఖాతాల్లో ఉన్న డబ్బులు మాయం.. అలానే కుటుంబ సర్వే ఓటీపీ వస్తుందని, చెప్పండి అంటూ ఫోన్ చేసి అడుగుతున్నారన్నారు. కాబట్టి సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త ఉండాలని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande