కర్నూలు, 21 డిసెంబర్ (హి.స.)
తల్లి పక్కన నిద్రిస్తున్న.. 8నెలల బాలుడిని అపహరించిన ఘటన కర్నూలు నగరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే… నగరంలోని మహీంద్రా షోరూం సమీపంలో ఢిల్లీకి చెందిన అజిత్, ఆశ దంపతులు షెడ్డు వేసుకొని నివాసం ఉంటున్నారు. వీరు కిడ్డీబేర్ బొమ్మలు, టాయ్స్ విక్రయిస్తూ జీవనం గడుపుతున్నారు. వీరి 8నెలల ఆకాష్ తో కలిసి నిద్రిస్తుండగా శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ పిల్లవాడిని అపహరించారు.
ఉదయం నిద్ర లేచేసరికి పక్కన కుమారుడు లేకపోవడంతో తల్లి ఆశ తల్లడిల్లిపోయింది. భర్త అజిత్, కుటుంబీకులతో కలిసి చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నాల్గవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..