హైదరాబాద్, 4 డిసెంబర్ (హి.స.)
ఆఫ్రికా దేశాలలో ఒకటైన నమీబియా దేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలైంది. గతంలో దేశ ఉప రాష్ట్రపతిగా పనిచేసిన నెటుంబో నంది-నైత్వా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె స్వాపో పార్టీకి చెందింది. నివేదికల ప్రకారం అధికారిక ఫలితాలు మంగళవారం (డిసెంబర్ 3) నాడు వెలుబడ్డాయి. దీని ప్రకారం స్వాపో పార్టీకి 57 శాతం ఓట్లు వచ్చాయి. ఈ సంఖ్య అధ్యక్షుడిగా మారడానికి అవసరమైన 50 శాతం ఓట్లకు మించి ఉంది. ఇక తన సమీప ప్రత్యర్థి పాట్రియాట్స్ ఫర్ ఛేంజ్ (ఐపిసి)కి చెందిన ఇటుల కేవలం 26 శాతం ఓట్లు మాత్రమే రావడంతో భారీ మెజారిటీతో నంది-నైత్వా గెలుపొందారు. 1990లో దక్షిణాఫ్రికా నుండి నమీబియా స్వాతంత్య్రం పొందింది. అప్పటి నుండి నంది-నాడైతవా రాజకీయాల్లో నిరంతరం క్రియాశీలకంగా ఉన్నారు. అయితే, ఈసారి ఎన్నికల్లో విజయం సాధించి పార్టీని మరింత పటిష్ట స్థితికి తీసుకెళ్లారు. నివేదికల ప్రకారం 72 ఏళ్ల నంది-నైత్వా చాలా కాలంగా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. ఆమె 1960 లలో స్వాపో పార్టీలో చేరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్