భారత్ లోని దౌత్యవేత్తలను వెనక్కి రప్పిస్తున్న బంగ్లాదేశ్..
తెలంగాణ, 6 డిసెంబర్ (హి.స.) ఇస్కాన్ కు చెందిన స్వామి చిన్మయి కృష్ణదాస్ అరెస్టుతో భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కోల్ కతా, త్రిపుర ఇద్దరు సీనియర్ దౌత్యవేత్తలు తక్షణమే తిరిగి రావాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. కోల్కతాలోని డి
బంగ్లాదేశ్


తెలంగాణ, 6 డిసెంబర్ (హి.స.)

ఇస్కాన్ కు చెందిన స్వామి

చిన్మయి కృష్ణదాస్ అరెస్టుతో భారత్- బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. కోల్ కతా, త్రిపుర ఇద్దరు సీనియర్ దౌత్యవేత్తలు తక్షణమే తిరిగి రావాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. కోల్కతాలోని డిప్యూటీ హైకమిషనర్ షిక్టార్ మహమ్మద్ అష్రఫుల్ రహ్మాన్, అగర్తలలోని అసిస్టెంట్ హైకమిషనర్ ఆరిఫ్ మహమ్మద్ను రీకాల్ చేస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం ప్రకటించింది. చిన్మయి కృష్ణదాస్ను అరెస్టు చేయడానికి నిరసనగా పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాల వద్ద ఆందోళనలు జరిగాయి. అందుకే, ఈ దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వీరిద్దరూ ఢాకా నుంచి పనిచేయాలని సూచించినట్లు సమాచారం. ఈనేపథ్యంలో అప్రఫుల్ రహ్మాన్ నిన్ననే బంగ్లాదేశ్కు చేరుకొన్నట్లు తెలుస్తోంది. ఇక త్రిపురలోని ఆరిఫ్ రేపు స్వదేశానికి వెళ్లిపోనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / వెంకటేశ్వర్ రావు విడియాల, జర్నలిస్ట్


 rajesh pande