హైదరాబాద్, 7 డిసెంబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే.. ఇవాళ ఉదయం ఫ్లోర్ మార్కెట్ ఏరియాలో దుండగులు సునీల్ జైన్ అనే వ్యక్తిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో సునీల్ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు.
స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు అక్కడున్న సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ వైపు పార్లమెంట్ సమాశాలు జరుగుతోన్న నేపథ్యంలో రాజధానిలో కాల్పుల ఘటన సంచలనం సృష్టిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్