సిరియాలో తీవ్రమైన అంతర్యుద్ధం..దేశ రాజధాని డమాస్కసన్ను స్వాధీనం చేసుకున్న తీవ్రవాదులు..
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతోంది. తిరుగుబాటుదారులు వరుసగా దేశంలోని కీలక నగరాలను తమ సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఆదివారం దేశ రాజధాని డమాస్కసన్ను స్వాధీనం చేసుకున్నారు. సైన్యం మరియు భద్రతా బలగాలు డమాస్కస్ అంతర్జాతీయ విమ
సిరియాలో అంతర్యుద్ధo


హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) సిరియాలో అంతర్యుద్ధం తీవ్రమవుతోంది. తిరుగుబాటుదారులు వరుసగా దేశంలోని కీలక నగరాలను తమ సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఆదివారం దేశ రాజధాని డమాస్కసన్ను స్వాధీనం చేసుకున్నారు. సైన్యం మరియు భద్రతా బలగాలు డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విడిచిపెట్టినట్లు సమాచారం. దేశ రాజధానిలోకి తిరుగుబాటుదారులు చొరబడటంతో అసద్ సైన్యం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు హెజ్బుల్లా ఓ మీడియా సంస్థకు తెలిపింది. ఇస్లామిస్ట్ హయత్- అల్-షమ్ గ్రూప్ డమాస్కస్కు తమ సాయుధ దళాలు చేరుకున్నట్లు ధృవీకరించాయి. 'సెద్నాయ జైలులో దౌర్జన్య యుగం ముగిసిందని' ఈ సందర్భంగా తిరుగుబాటుదారులు ప్రకటించారు. రాజధాని వెళ్లే మార్గంలో వ్యూహాత్మక నగరమైన హోమ్స్ను తిరుగుబాటుదారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. కానీ సిరియా రక్షణ శాఖ మాత్రం ఈ విషయాన్ని ఖండించింది. హోమ్స్ లో పరిస్థితి స్థిరంగానే ఉన్నట్లు ప్రకటించింది.

దేశ రాజధానిలోకి తిరుగుబాటు దారులు చొరబడటంతో ఆ దేశ అధ్యక్షుడు బషర్-అల్-అసద్ డమాస్కసన్ను విడిచి గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లిపోయారు. అధ్యక్షుడు విమానంలో గుర్తు తెలియని చోటుకి వెళ్లిపోయినట్లు ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande