మంచు ఫ్యామిలీలో గొడవలు.. పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న మోహన్ బాబు, మనోజ్
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) మంచు ఫ్యామిలీలో గొడవలు తాజాగా కొట్టుకునే స్థాయికి చేరాయి . దీంతో తండ్రి, కొడుకు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఆస్తుల పంపకాల విషయంలో ఈ గొడవలు తలెత్తినట్లు సమాచారం. మంచు మనోజ్, మోహన్ బాబు గొడవపడి హైదరాబ
మోహన్ బాబు ఇంట్లో గొడవలు


హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) మంచు ఫ్యామిలీలో గొడవలు తాజాగా కొట్టుకునే స్థాయికి చేరాయి . దీంతో తండ్రి, కొడుకు పోలీస్ స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

ఆస్తుల పంపకాల విషయంలో ఈ గొడవలు తలెత్తినట్లు సమాచారం. మంచు మనోజ్, మోహన్ బాబు గొడవపడి హైదరాబాద్ లోని ఫహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో నేడు ఒకరికపై ఒకరు పోలీసులకి పరస్పర ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంచు మనోజ్ తనపై అలాగే తన భార్య మౌనిక రెడ్డిపై మోహన్ బాబు దాడి చేసినట్లు పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నాడు

ముందుగా నటుడు మోహన్ బాబుపై కొడుకు మంచు మనోజ్ పోలీసెస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తండ్రి తనను కొట్టాడని మనోజ్ ఫిర్యాదు చేయగా.. మనోజే తనపై దాడి చేశాడని కొడుకుపై మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande