హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)
మహానటుడు, నటరత్న పద్మశ్రీ డా. ఎన్టీరామారావు నటించిన తొలి సినిమా 'మనదేశం' 1949 నవంబర్ 24న విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్గా చిన్న పాత్రను పోషించారు. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మీర్జాపూర్ రాజావారు నిర్మాత. ఈ సినిమా విడుదలై 75ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 14న విజయవాడలో ఘనంగా 'మనదేశం వత్రోత్సవ వేడుకను’ నిర్వహించాలని తెలుగు చిత్రపరిశ్రమ నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఇటీవల తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి హైదరాబాద్ కార్యాలయంలో ఓ
సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్యమండలి,తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘం అందరూ కలిసి ఈ సమావేశంలో పాల్గొని,విజయవాడలో జరగబోయే వేడుక గురించి చర్చించారు.
అందరూ కలిసికట్టుగా, ఘనంగా ఈ వేడుకను జరపాలని సినీ సంఘాల సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..