గత పది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి పది లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం.. కిషన్ రెడ్డి
హైదరాబాద్: ఏప్రిల్ 18 (హిం.స) గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు
గత పది ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి పది లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం.. కిషన్ రెడ్డి


హైదరాబాద్: ఏప్రిల్ 18 (హిం.స)

గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి కిషన్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఇప్పటి వరకు ఒక్క అవినీతి మచ్చ కూడా లేదన్నారు. ఎవరినీ బెదిరించలేదని, ఎవరిపైనా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని చెప్పారు. తనపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారికి ప్రజలు గతంలోనే బుద్ధి చెప్పారన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి అభివృద్ధి కోసం పని చేశానని భావిస్తేనే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande