వనపర్తి లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డి పై సొంత పార్టీ నాయకులె దాడి..
తెలంగాణ వనపర్తి ఏప్రిల్ 18(హిం.స) వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై సొంతపార్టీ నాయకులే పెట్రో
వనపర్తి లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డి పై సొంత పార్టీ నాయకులె దాడి..


తెలంగాణ వనపర్తి ఏప్రిల్ 18(హిం.స)

వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై సొంతపార్టీ నాయకులే పెట్రోల్తో దాడికి యత్నించడం కలకలం రేపింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో పలువురు చేరడంతో ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వర్గీయులు గురువారం హల్చల్ చేశారు. చేరికలను నిరసిస్తూ తాడిపర్తి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గణేష్ గౌడ్, తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి వద్ద ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో గణేష్ గౌడ్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకోవడమే కాకుండా.. చేరికలపై మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పెట్రోల్తో దాడికి ప్రయత్నించి హంగామా సృష్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande