ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం
పెదవాల్తేరు, : 18 ఏప్రిల్ (హిం.స) యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం


పెదవాల్తేరు, : 18 ఏప్రిల్ (హిం.స) యువతకు విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. ఎంవీపీకాలనీలోని తెదేపా కార్యాలయంలో బుధవారం సాయంత్రం జనసేన ప్రైవేటు ఎంప్లాయిస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఆర్గనైజేషన్ ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. విశాఖకు వచ్చిన పలు ప్రైవేటు కంపెనీలు వెనక్కి వెళ్లిపోవడంతో ఉపాధి అవకాశాలు కోల్పోయామన్నారు. విద్యారంగంలో మంచి ప్రణాళికలతో మార్పులు తీసుకువస్తామన్నారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande