ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు నేటితో 33 ఏళ్లు
తెలంగాణ వినోదం ఏప్రిల్ 28 (హిం.స) నందమూరి తారకరామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన పిదప నటించ
ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు నేటితో 33 ఏళ్లు


తెలంగాణ వినోదం ఏప్రిల్ 28 (హిం.స)

నందమూరి తారకరామారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన పిదప నటించిన చిత్రం బ్రహ్మర్షి విశ్వామిత్ర విడుదలై నేటితో 33 ఏళ్లు పూర్తి అయింది.

నందమూరి జయకృష్ణ సమర్పణలో నందమూరి హరికృష్ణ నిర్వహణలో ఎన్.టి.ఆర్. చారిటబుల్ ట్రస్ట్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. గారు నటించిన ఈ చిత్రం 19.04.1991లో విడుదల కావడం జరిగింది.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్: ఎన్.టి.రామారావు, రచన, మాటలు: నాగబైరవ కోటేశ్వరరావు, పాటలు: సి. నారాయణరెడ్డి, సంగీతం: రవీంద్రజైన్, ఫోటోగ్రఫీ: నందమూరి మోహనకృష్ణ అందించడం జరిగింది.ఈ చిత్రం లో ఎన్.టి.రామారావు, గుమ్మడి, నందమూరి బాలకృష్ణ, మీనాక్షి శేషాద్రి, మిక్కిలినేని తదితరులు నటించారు.

1989జూన్ 18 న హైదరాబాద్, నాచారం లోని రామకృష్ణ స్టూడియోలో నాటి నేషనల్ ఫ్రంట్ నాయకులు వి.పి.సింగ్, దేవీలాల్,కరుణానిధి, మహంతా తదితరుల సమక్షంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కావడం విశేషం.

ఈచిత్రం షూటింగ్ జరిగే సమయంలో ఎన్టీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు నిర్వహిస్తూ షూటింగ్ లో పాల్గొనటం జరిగింది.ఎన్టీఆర్ గారు ఈ చిత్రంలో తన విశ్వరూపం ప్రదర్శిస్తూ ఎక్కడా వన్నె, వాసి తగ్గకుండా మన ప్రాచీన సంస్కృతి వైభవోన్నతికి తన అసమాన ప్రజ్ఞా పాటవాలను జోడించి ఉన్నతంగా ఈ చిత్రాన్ని రూపకల్పన గావించినప్పటికి ఈ సినిమా ఆశించిన మేరకు విజయవంతం కాలేకపోయింది.

ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషలలో చిత్రీకరించారు. ఈ చిత్రం హిందీ వర్షన్ లో భరతుడు పాత్ర లో జూనియర్ ఎన్.టి.ఆర్. (తారక్) తొలిసారి బాలనటుడిగా చలన చిత్రరంగానికి పరిచయం కావటం జరిగింది. అయితే విశ్వామిత్ర హిందీ చిత్రం మాత్రం ఎందుకో విడుదలకు నోచుకోలేదు.

సంపత్ రావు హిందుస్తాన్ సమాచార్


 rajesh pande