సీఎం రేవంత్ రెడ్డి పై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్
హైదరాబాద్ ఏప్రిల్ 20 (హిం.స) తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ పర్యటనలో.. మహి
సీఎం రేవంత్ రెడ్డి పై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్


హైదరాబాద్ ఏప్రిల్ 20 (హిం.స)

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ పర్యటనలో.. మహిళా అన్న ఇంగిత జ్ఞానం లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు ముప్పేటదాడి చేస్తున్నారని.. సోయిలేకుండా రాక్షరాసులు.. రాబంధువులలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. “ఏది మాట్లాడినా కేసీఆర్ లాగా అరుణమ్మ ఊరుకుంటుందని అనుకుంటున్నానా” అంటూ రేవంత్ పై విరుచుకుపడ్డారు.

పదేళ్ల కిందటి రేవంత్ రెడ్డిగా వ్యవహరిస్తే ముఖ్యమంత్రి పదవికే అవమానమన్నారు. సేవ అంటే సీఎంకు అర్ధం తెలుసా అని ప్రశ్నించారు. “మహిళను అవమానం చేసేలా మాట్లాడుతున్నారు... నన్ను పండపెట్టి తొక్కుతారా రండి చూద్దాం” అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో సీఎం మహబూబ్నగర్లో నామినేషన్ కోసం వచ్చారన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద పదిలక్షల రూపాయలు ఉచితంగా ఎంతమందికి ఇచ్చారో జాబిత విడుదల చేయాలని... అందులో ఆయుష్మాన్ భారత్ నిధులెన్నో చెప్పాలని డిమాండ్ చేశారు.

మొదట ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయకుంటే సీఎం తన పగవికి రాజీనామా చేస్తారా అంటూ ఛాలెంజ్ విసిరారు. లోక్సభ ఎన్నికల తర్వాత 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రమాణం చేస్తారా అని డీకే అరుణ ఈ సందర్భంగా రేవంత్ ను ప్రశ్నించారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande