పొట్టి వరల్డ్ కప్ ఆటగాళ్ల ఎంపికకు బీసీసీఐ కసరత్తు దాదాపు పూర్తి
తెలంగాణ క్రీడలు ఏప్రిల్ 20 (హిం.స) ఐపీఎల్-2024 ముగిసిన వారం రోజుల లోపే పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం
పొట్టి వరల్డ్ కప్ ఆటగాళ్ల ఎంపికకు బీసీసీఐ కసరత్తు దాదాపు పూర్తి


తెలంగాణ క్రీడలు ఏప్రిల్ 20 (హిం.స)

ఐపీఎల్-2024 ముగిసిన వారం రోజుల లోపే పొట్టి ప్రపంచకప్ టోర్నీ ఆరంభం కానుంది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1న టీ20 వరల్డ్కప్-2024కు తెరలేవనుంది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్లో టీమిండియా జూన్ 5న తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది.

ఇక ప్రపంచకప్ ఆడే ప్రాథమిక జట్ల ఎంపిక కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి మే 1 వరకు సమయం ఇచ్చింది. ఇందులో భాగంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ సైతం ఇప్పటికే ఐసీసీ ఈవెంట్లో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టుపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో రన్మెషీన్ విరాట్ కోహ్లి, టీ20 నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్, పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్రీత్ బుమ్రా, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్, యువఫాస్ట్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తదితరుల పేర్లను సెలక్టర్లు ఖరారు చేసినట్లు సమాచారం.

మిగిలిన ఐదు స్థానాలకు.. ఐపీఎల్-2024లో తొలి నాలుగు వారాల ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కొత్త వాళ్లకు మాత్రం ఈ జట్టులో స్థానం ఇచ్చేందుకు సెలక్టర్లు సుముఖంగా లేనట్లు సమాచారం.

టీ20 ప్రపంచకప్ టోర్నీ-2024కు భారత జట్టు (అంచనా)

రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.

సంపత్ రావు హిందుస్తాన్ సమాచార్


 rajesh pande