వడగళ్ల వాన బీభత్సం
డొంకేశ్వర్(ఆర్మూర్), 20 ఏప్రిల్ (హిం.స): జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్
వడగళ్ల వాన బీభత్సం


డొంకేశ్వర్(ఆర్మూర్), 20 ఏప్రిల్ (హిం.స): జిల్లాలో శుక్రవారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులకు వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయా యి. కోతకొచ్చిన మామిడి కాయలు రాలిపోయా యి. ఉరుములు మెరుపులతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు నందిపేట మండలం ఖుద్వాన్పూర్లో మూడు గేదెలు చనిపోయాయి. పలు మండలాల్లో విద్యుత్కు అంతరాయం కలిగింది. వడగళ్లు, గాలుల ప్రభావంతో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో కోతదశకు వచ్చిన వరి గింజలు రాలిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 25 శాతం పంట కోయాల్సి ఉంది.

అకాల వర్షానికి వెయ్యి ఎకరాలకు పైగా వరికి నష్టం జరిగే అవకాశముందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande