దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అబుధాబీ, దిల్లీ, 20 ఏప్రిల్ (హిం.స): అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి


అబుధాబీ, దిల్లీ, 20 ఏప్రిల్ (హిం.స): అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. అనూహ్య రీతిలో కురిసిన భారీ వర్షాల కారణంగా దుబాయ్లో విమానయాన కార్యకలాపాలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే విమానాలను దుబాయ్లోకి అనుమతిస్తున్నారు. దుబాయ్, చుట్టుపక్కల ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో విమాన ప్రయాణాలపై కొన్ని సూచనలు జారీ అయ్యాయి. విమానం బయల్దేరే తేదీ, సమయం గురించి సంబంధిత విమానయాన సంస్థల నుంచి ధ్రువీకరణవచ్చిన తర్వాతే విమానాశ్రయాలకు బయల్దేరాలనేది వాటిలో ఒకటి.

విమానాల రద్దు.. రీషెడ్యూల్ : విమానాల రాకపోకల పరంగా ఈ నెల 21 వరకు ఆంక్షలు ఉండడంతో శుక్రవారం ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్, స్పైస్జెట్, ఇండిగో సంస్థలు దుబాయ్కి తమ సర్వీసులను రద్దు గానీ, రీషెడ్యూల్ గానీ చేశాయి

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande