తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు
హైదరాబాద్: 20 ఏప్రిల్ (హిం.స) నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం క
తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు


హైదరాబాద్: 20 ఏప్రిల్ (హిం.స) నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారింది. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో వర్షం కురియడంతో.. ఎండవేడిమి, ఉక్కపోత నుంచి నగర వాసులకు ఉపశమనం కలిగింది.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి కారణంగా రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఒక్కసారిగా మేఘావృతంగా మారింది. రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. నేటి( శనివారం) నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande