పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ 9.5 లక్షల కోట్ల నిధులు కేటాయించిన మోడీ సర్కార్
తెలంగాణ రంగా రెడ్డి కొందుర్గ్ ఏప్రిల్ 23(హిం స) *పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ 9.5 లక్షల కోట్ల నిధ
*పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ 9.5 లక్షల కోట్ల నిధులు కేటాయించిన మోడీ సర్కార్*


తెలంగాణ రంగా రెడ్డి కొందుర్గ్ ఏప్రిల్ 23(హిం స)

*పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ 9.5 లక్షల కోట్ల నిధులు కేటాయించిన మోడీ సర్కార్*

*పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీనే కోరుకుంటున్నారు*

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి

పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ 9.5 లక్షల కోట్ల నిధులు కేటాయించిన మోడీ సర్కార్ కు ప్రజలు మరోసారి ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అందే బాబయ్యలు కోరారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో షాద్ నగర్ నియోజక వర్గం కొందుర్గు మండల కేంద్ర మండల అధ్యక్షులు కొమరబండ శ్రీశైలం అధ్యక్షతన ఏర్పాటు చేసిన బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య హాజరయ్యారు. వారితో పాటు మచ్చ సుధాకర్, ఈసరి సత్యనారాయణ, బోయ కురుమయ్య, బలవంత్ రెడ్డి, చిట్టెం లక్ష్మీకాంత్ రెడ్డి, బోయ శంకర్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల మోడీ పాలన లో పేదల కోసం, రైతుల కోసం, అణగారిన వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసారని అన్నారు. అయోధ్యలో రామ మందిరం 370 ఆర్టికల్ రద్దు, చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్, ఇలా ఎన్నో దశబ్దాల భారతీయుల కలలను సాకారం చేసారని అదేవిధంగా త్రిపుల్ తలాక్ రద్దు చేసి మైనారిటీ మహిళలకు మోడీ అండగా నిలిచారని అన్నారు. 2047 నాటికి స్వాతత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయిన అమృత కాలంలో అభివృద్ధి చెందిన భారత్ కోసం, వికసిత్ భారత్ లక్ష్యంగా మోడీ గారి పాలన కొనసాగుతుందని అన్నారు. ఇలాంటి అనేక విషయాలపై ప్రజల్లోకి వెళ్లాలని, మోడీ పదేళ్ళ సుపరిపాలనను ప్రజల్లో చర్చ చేయాలనీ అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ ని కోరుకుంటున్నారని

400 స్థానాలతో మోడీ గారు మరోసారి ప్రధాన మంత్రి కావడం ఖాయమని అందులో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ డీకే అరుణ భారీ మెజారిటీ తో గెలిపించు కోవాలని సూచించారు. ఈ సందర్బంగా అందే బాబయ్య మాట్లాడుతూ గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ 9.5 లక్షల కోట్ల నిధులను కేటాయించారని అన్నారు.

రాబోయే ఎన్నికలు దేశానికి సబంధించినవని మళ్ళీ కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదు, తెలంగాణను అభివృద్ధి చేసేది లేదని అన్నారు. దేశాభివృద్ధి తెలంగాణ అభివృద్ధి మోడీ ప్రభుత్వం తోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య గౌడ్ ,శివా రెడ్డి ,కారుకొండ సుధాకర్ , ప్రభులింగం, యువమోర్చ యాదయ్య, సందీప్ యాదవ్, సుబ్రహ్మణ్యం, రవి నాయక్, మరియు బూత్ అధ్యక్షులు తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

ఇందులో భాగంగా సోమారం పాడు, అయ్యవారిపల్లి, పాత ఆగిర్యల, కొత్త ఆగిర్యాల కొందుర్గు గ్రామాలకు చెందిన యువకులు భారీగా బీజేపీలో చేరడం జరిగింది. ఈ సందర్బంగా శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్య కండువాతో వారిని పార్టీలోకి స్వాగతించారు..

జనార్థన్ రెడ్డి రంగా రెడ్డి జిల్లా హిందుస్థాన్ సమాచార్


 rajesh pande